సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బ్రహ్మాజీ ట్వీట్…!

-

గత కొన్నిరోజులుగా తెలంగాణ రాష్ట్రము మొత్తాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇక హైదరాబాద్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు విడవడం లేదు. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.గతంలో ఎప్పుడు లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి.భారీ వర్షాలు కారణంగా హైదరాబాద్ ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఈ వర్షాల వల్ల 30 మందికి పైగా మరణించారు.

అయితే హైదరాబాద్ వరదలు పై సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం రోజుకో సెటైర్ వేస్తున్నారు. కొందరు నెటిజన్లు ఓలా, ఉబర్ యాప్ ల్లో బోటు సర్వీస్ సౌలభ్యం ఉందా అంటూ కామెంట్లు చేసారు.తాజాగా టాలీవుడ్ యాక్టర్ బ్రహ్మాజీ కూడా హైదరాబాద్ వరదలపై ఓ సెటైర్ వేశారు. తాను ఓ మోటార్ బోటు కొనాలని అనుకుంటున్నట్టు ఏదైనా మంచి బోటు గురించి తెలిస్తే చెప్పండి ప్లీజ్ అంటూ ట్వీట్ చేసారు యాక్టర్ బ్రహ్మాజీ . దీనితో పాటు తన ఇంటి చుట్టూ ఉన్న వరద నీరు ఫోటోలను కూడా పోస్ట్ చేసారు. దీనిపై నెటిజన్లు పలు రాకారులుగా విమర్శలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news