కరోనా దెబ్బకు ఇంటర్నెట్ స్లో డౌన్…!

-

కరోనా దెబ్బకు ఇంటర్నెట్ స్లో డౌన్ అయిపోతుంది. లోకల్ నెట్, మొబైల్ నెట్ అన్నీ కూడా స్లో డౌన్ అయిపోతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న అన్ని ఐటి కంపెనీలు కూడా వర్క్ ఫ్ర౦ హోం ని ప్రకటించాయి. దీనితో అందరూ కూడా ఇప్పుడు ఇంట్లో ఉండే తమ విధులు నిర్వహిస్తున్నారు. దీనితో ఇంటర్నెట్ బాగా స్లో అయిపోతుంది. మొబైల్ కి కూడా వచ్చే పరిస్థితి ఇప్పుడు కనపడటం లేదు.

దీనితో టెలికాం కంపెనీలు అన్నీ కూడా ఇప్పుడు జాగ్రత్తలు పడుతున్నాయి. వర్క్ ఫ్రం హోం కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని భావిస్తుంది. త్వరలోనే ఆఫర్లను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎయిర్టెల్, జియో ఇప్పటికే దీనిపై ప్లాన్ లు రెడీ చేసినట్టు సమాచారం. ఇక లోకల్ నెట్ వర్క్స్ అన్ని కూడా ఇప్పుడు ఇంటర్నెట్ ప్లాన్ ని మరింతగా పెంచే ప్లాన్ విధంగా ప్రణాలికలు సిద్దం చేస్తున్నాయి.

హాత్ వే, యాక్ట్ సహా పలు సంస్థలు ఇప్పుడు వర్క్ ఫ్రం హోం కోసం కొత్త ప్లాన్ లు ప్రకటించే యోచనలో ఉన్నాయి. త్వరలో వాటిని ప్రకటిస్తారని అంటున్నారు. ఇప్పటికే టెలికాం కంపెనీలు ధరలు భారీగా పెంచాయి నష్టాల పెరుతో. ఇప్పుడు మళ్ళీ అదే ప్లాన్ లో ఉన్నాయని అంటున్నారు. వర్క్ ఫ్రం హోం ఆఫర్ల రేట్స్ భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news