ఇలా అయితే.. విమ‌ర్శ‌లు రాక ఏమొస్తాయి జ‌గ‌న్‌..!

-

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఆయ‌న‌ను అభిమానించేవారు వైసీపీ సానుభూతి ప‌రుల నుంచి కూడా ఈ రోజు కొన్ని స ద్వివిమ‌ర్శ‌లు చోటు చేసుకున్నాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గా చోటు చేసుకున్న ఈ ప‌రిణామం.. ఆలోచింప జేస్తోంది. ఏపీ సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేసి ప‌ది మాసాలు అవుతోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న రెండు సార్లు మీడియాతో ప్రెస్ మీట్ పెట్టారు. అయితే, ఈ రెండు సార్ల‌లోనూ అత్యంత కీల‌క‌మైంది.. ఆదివారం (నిన్న‌) జ‌రిగిన స‌మావేశం. ఒక‌ప‌క్క జ‌న‌తా క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో నిర్వ‌హించిన ఈ స‌మావేశానికి ప్రాధాన్యం ఉం ది.

రాష్ట్రంలో ప్ర‌జ‌లు మూకుమ్మ‌డిగా ఆదివారం నాటి జ‌న‌తా క‌ర్ఫ్యూను విజ‌య‌వంతం చేశారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌ను అభినిందిస్తూనే.. రాష్ట్రంలో ఇక‌పై తీసుకునే చ‌ర్య‌ల‌ను సీఎం జ‌గ‌న్ మీడియా ద్వారా ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. అయితే, ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా… ఆయ‌న ప్రెస్ మీట్‌లో మాట్లాడిన తీరు, చేసిన వ్యా ఖ్యల‌పై ఆయ‌న సానుబూతి ప‌రులు కూడా విస్మ‌యం, విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సౌత్ కొరియాలో క‌రోనా పుట్టిందని, ఒక‌రి నుంచి ఈ ప్ర‌పంచం మొత్తం వ్యాపించింద‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించాన్ని త‌ప్పుప‌డుతు న్నారు.

ప్ర‌స్తుతం క‌రోనాపై ప్ర‌తి ఒక్క‌రూ అవ‌గాహ‌న పెంచుకున్నార‌ని, మూడో త‌ర‌గ‌తి పిల్లాణ్ని అడిగినా.. క‌రోనా వ్యాపించిన దేశం చైనా అని.. అక్క‌డి నుంచి ఇత‌ర దేశాల‌కు వెళ్లిన వారి నుంచి ఈ వైర‌స్ వ్యాప్తి చెందిం ద‌నే విష‌యాన్ని వివ‌రిస్తారు. కానీ, సీఎం జ‌గ‌న్ మాత్రం చిత్ర‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని త‌ప్పుబ‌డుతు న్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌తి దానికీ రాసిచ్చిన స్క్రిప్టు చూడ‌డాన్ని కూడా కొంద‌రు త‌ప్పుబడుతున్నారు.

మ‌హా అయితే ఓ అర‌గంట నిర్వ‌హించే ప్రెస్ మీట్‌లో అన్ని సార్లు రాసిచ్చిన స్క్రిప్టు చూడ‌డం ఎందుకు? అయినా రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు, ప్ర‌పంచ ప‌రిణామాల‌ను కొన్నింటినైనా గుర్తు పెట్టుకోలే రా? అని అన్నారు. మొత్తానికి జ‌గ‌న్ వ్య‌వ‌హారంపై తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news