ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఎక్కడా కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనపడటం లేదు. దీనిపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం 10 లక్షలు దాటిన కరోనా కేసులు… శనివారం 11 లక్షలకు చేరే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతుంది.
ఇక అమెరికాలో అయితే కరోనా అక్కడి ప్రజలకు చుక్కలు చూపిస్తుంది. శనివారం తెల్లవారు జాముకి 1096684కి చేరుకున్నాయి కరోనా కేసులు. వీరిలో228370 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇక మరణాలు కూడా 60 వేలకు చేరువలో ఉన్నాయి. 59128 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం 809186 మంది కరోనాతో బాధపడుతున్నారు. వీరిలో 39405 మంది ఆరోగ్యం విషమంగా ఉంది.
అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 276037. అక్కడ శుక్రవారం ఒక్క రోజే 31160 మంది వ్యాధి బారిన పడ్డారు. శుక్రవారం ఆ దేశంలో 1314 మంది చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 7385కి చేరింది. ఇటలీలో కొత్తగా 4585 కేసులు నమోదు అయ్యాయి. రాగా… మొత్తం కేసులు 119827 గా ఉన్నాయి. శుక్రవారం అక్కడ 766 మంది చనిపోయారు. దీనితో మరణాలు 15 వేలకు దగ్గరలో ఉన్నాయి.