పాపం చిన్న ఉద్యోగులు, కరోనా రోడ్డున పడేసిందా…?

-

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తున్న సంగతి స్పష్టంగా అర్థం అవుతోంది. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఈ వైరస్ విదేశాల నుంచి అత్యంత వేగంగా పాకుతుంది. ఈ నేపథ్యంలోనే దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. మహారాష్ట్ర ,కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ,బీహార్ వంటి రాష్ట్రాల్లో ఇప్పుడు విద్యాసంస్థలు వ్యాపార సముదాయాలు అన్నీ కూడా బంద్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

ఇక ఇప్పుడు ఇది పక్కన పెడితే కరోనా వైరస్ నేపథ్యంలో ఎవరినీ ఇళ్ల నుంచి బయటకు రావద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. దీనితో అనేక రంగాల్లో ఉన్న ఉద్యోగులు తమ ఉపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా చిన్నచిన్న ఐటి కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు అదేవిధంగా మార్కెటింగ్ ఉద్యోగులు అలాగే చిన్నచిన్న,

ఆ వ్యాపార సముదాయాల లో పనిచేసే ఉద్యోగుల తో పాటుగా మరికొంత మంది ఉద్యోగాలు కోల్పోయి అవకాశాలు ఉన్నాయంటున్నారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో చిన్న చిన్న ఐటీ కంపెనీలు విస్తరించాయి. ఇప్పుడు ఎవరిని కూడా ఉద్యోగాలకు రావద్దని అందరూ వర్క్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. పూణే సహా పలు ప్రాంతాల్లో అన్ని రకాల ఆఫీసులకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

వాటిని తక్షణమే మూసివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఆయా రంగాల్లో ఉన్న వారు ఉపాధి కోల్పోయే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. చిన్నచిన్న సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుని ఎనిమిది వేలకు పదివేలకు 12 వేలకు పలువురు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇప్పుడు ఆఫీసుకి రావొద్దని కంపెనీలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి.

దీంతో ఐటి ఉత్పత్తులు ఆగిపోయే అవకాశం ఉందని మరి కొన్ని నెలలుగా తీవ్రంగా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం సహా పలు ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహించే వారు ఇప్పుడు వాటిని మూసివేసే పరిస్థితి ఏర్పడింది. దీనితో వారు కూడా భారీ నష్టాలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news