ఆ కోళ్ళ ఫారం యజమాని ఆఫర్ చూస్తే కన్నీళ్లు ఆగవు…!

-

ఒక తప్పుడు ప్రచారం వందల మంది పౌల్ట్రీ రైతుల బతుకులను బుగ్గి పాలు చేసింది. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులు… చికెన్ తింటే కరోనా వస్తుంది అనే ప్రచారానికి అన్ని విధాలుగా బలైపోయారు. వేలాది మంది రైతులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కోళ్ళను పెంచారు. ఇప్పుడు కరోనా దెబ్బకు చాలా మంది రైతులు తక్కువ ధరకు కోళ్ళను ఇచ్చేస్తున్నారు జనాలకు.

తాజాగా ఒక రైతు వంద రూపాయలకు మూడు కోళ్ళు ఇచ్చేసాడు.. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం తాటికొండ గ్రామానికి చెందిన పౌల్ట్రీ వ్యాపారి తన కోళ్లఫామ్‌లో 10వేల కోళ్లను పెంచుతున్నాడు. అయితే కరోనా దెబ్బకు కోడిని కొనే వాడు లేకపోయాడు. దాణా పెట్టుబడి భారీగా పెరిగిపోవడంతో… ఇక లాభం లేదు అనుకుని కోళ్ళను తక్కువ ధరకు విక్రయించాలని ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

గురువారం చిలుపూరు మండలంలోని చిన్నపెండ్యాల, రాజవరం, తీగలతండా, వెంకటేశ్వరపల్లె గ్రామాలలో కోళ్ళను ట్రాలీలో వేసుకుని తిరిగాడు ఆ రైతు… మూడు కోళ్ళను వంద రూపాయలకు విక్రయించాడు. మూడు రోజులుగా గ్రామాల్లో తిరిగినా కేవలం 1300 కోళ్లను మాత్రమే విక్రయించానని, సుమారు 3 నుంచి 4లక్షల వరకు నష్టం వాటిల్లిందని సదరు రైతు కన్నీటి పర్యంతం అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news