తెలంగాణాలో విస్తరిస్తున్న కరోనా…!

-

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తన ప్రభావం చూపిస్తుంది. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న కరోనా వైరస్ ఇప్పుడు దేశాన్ని చుట్టేస్తుంది. ఇన్నాళ్ళు కరోనా వలన ఇబ్బంది లేదు అని భావించిన రాష్ట్రాలకు కూడా కరోనా వేగంగా విస్తరిస్తుంది. తెలంగాణాలో కరోనా వైరస్ ని ప్రభుత్వం ఎన్ని విధాలుగా కట్టడి చేసినా సరే అది మాత్రం తగ్గడం లేదు. ఊహించని స్థాయిలో విస్తరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతుంది.

ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో క్రమంగా కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. నిన్న ఒక్కరోజే తెలంగాణా లో 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ నిన్న రాత్రి (బుధవారం, మార్చి18) ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ 9 కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13 కు చేరుకుంది. దీనితో తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఇండోనేషియా నుంచి కొన్ని రోజుల క్రితం మతపరమైన కార్యక్రమాల కోసం కొంతమంది భారత్ లోకి రాగా… వారిలో కొందరు ఢిల్లీ నుంచి రైలు మార్గంలో తెలంగాణా లోని కరీంనగర్, రామగుండం పరిసర ప్రాంతాల్లో పర్యటించినట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. వీరు అక్కడి మసీదుల్లో షెల్టర్ తీసుకున్నారని ప్రభుత్వం గుర్తించింది. దీనితో కరీంనగర్ లో కర్ఫ్యూ విధించారు.

Read more RELATED
Recommended to you

Latest news