ప్రస్తుతం కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే ఈ మహమ్మారి వైరస్ పై ముఖ్యంగా అవగాహన అవసరం అని అధికారులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. కాని చదువుకుని ఎంతో లోకజ్ఞానం ఉన్నవారు సైతం ఈ మహమ్మారి వైరస్ పై అవగాహన లేక చివరికి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఎన్నో తెర మీదకి వస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఓ రిటైర్డ్ జడ్జి ఇలాగే ఆత్మహత్య చేసుకున్నారు.
వరంగల్ జిల్లా న్యాయమూర్తిగా పనిచేసి పదవీవిరమణ పొందిన రామచంద్రారెడ్డి.. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. కరోనా భయంతో ఆత్మహత్య చేసుకున్నారు ఆయన . రక్తపోటు డయాబెటిస్ క్షయ వ్యాదులతో బాధపడుతున్నానని… ఒకవేళ తాను కరోనా వైరస్ బారిన పడితే బతకడం కష్టమే అంటూ సూసైడ్ నోట్లో పేర్కొనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అందుకే ముందుగానే ఆత్మహత్య చేసుకొని తన ప్రాణాలను తీసుకున్నాను అంటూ సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు సదరు రిటైర్డ్ జడ్జి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.