కరోనా మహమ్మారి వెలుగు చూసి.. దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. ఈ రెండేళ్ల కాలంలో అనేక కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేశాయి. నిన్నమొన్నటి దాకా అత్యంత ప్రమాద కారిగా డెల్టా వేరియంట్ ప్రజలను వణికించింది. అయితే.. ఇప్పుడు డెల్టా వేరియంట్ ను తలదన్నే.. ఒమిక్రాన్ అనే మరో వేరియంట్ సౌతాఫ్రికాలో వెలుగు చూసింది. కరోనా తగ్గుముఖం పట్టి… సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో… ఈ ఒమిక్రాన్ అందరినీ భయా బ్రాంతులకు గురి చేస్తోంది.
ఇది ఇలా ఉండగా… ఒమిక్రాన్ పుట్టిన దేశమైన సౌతాఫ్రికా నుంచి హైదరాబాద్ కు కొంత మంది వచ్చారు. సౌతాఫ్రికా లోని…. బోట్స్‌వానా నుంచి 16 మంది హైదరాబాద్ ఎయిర్ పోర్టు కు చేరినట్లు సమాచారం అందుతోంది. అయితే.. ఈ నేపథ్యంలోనే… అందరికీ ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఈ కరోనా పరీక్షల్లో…. ఏకంగా 11 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు గత మూడు రోజుల్లో 185 మంది ప్రయాణికులు వచ్చారని తెలిపారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో వారంతా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారని తెలిపారు. ఇందులో 11 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు అధికారులు పేర్కొన్నారు.