మ‌ల‌యాళ హీరో ముమ్ముట్టికి క‌రోనా పాజిటివ్

-

సినిమా నటీ న‌టులపై క‌రోనా పంజా విసురుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది న‌టీ న‌టులు క‌రోనా బారిన ప‌డ్డారు. తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ సెల‌బ్రెటీలకు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. తాజా గా మ‌ల‌యాళ భాష‌లో ప్ర‌ముఖ హీరో అయిన ముమ్ముట్టికి కూడా క‌రోనా వైర‌స్ సోకింది. త‌న‌కు క‌రోనా స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు రావ‌డంతో శ‌నివారం క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష చేసుకున్నానని తెలిపారు.

Mammootty

ఈ పరీక్ష ఫ‌లితంలో త‌న‌కు క‌రోనా నిర్ధార‌ణ అయింద‌ని త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ప్ర‌క‌టించాడు. ప్ర‌స్తుతం తన ఆరోగ్యం బాగానే ఉంద‌ని తెలిపారు. అలాగే తాను ప్ర‌స్తుతం త‌న ఇంట్లోనే ఐసోలేష‌న్ లో ఉన్నాన‌ని అన్నారు. తాను క‌రోనా విష‌యంలో చాలా జ‌గ్ర‌త్త‌లు తీసుకున్నాన‌ని అన్నారు. అయినా.. క‌రోనా వైర‌స్ త‌న‌కు సోకింద‌ని తెలిపారు. కాగ త‌న‌ను ఇటీవ‌ల క‌లిసిన వారు అంద‌రూ కూడా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష చేసుకోవాల‌ని కోరారు. అలాగే క్వారైంటెన్ లో ఉండాల‌ని విజ్ఞాప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version