చైనా లో మళ్లీ కరోనా విజృంభణ..ఆ నగరం షట్ డౌన్..!

కరోనా పుట్టినిల్లు చైనా లో మళ్లీ వైరస్ విజృంభణ మొదలైంది. మళ్ళీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. డెల్టా వేరియంట్ లతో పాటు మరికొన్ని వేరియంట్ లు చైనా లో బయటపడుతున్నాయి. దాంతో ప్రభుత్వం ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకుంది. పూజియాన్ ప్రావిన్స్ లోని పుతియన్ నగరం లో 19 కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో ఆ నగరం లో ఆంక్షలు విధించారు. ఇక ఆదివారం నుండి ఆ నగరాన్ని పూర్తిగా షట్ డౌన్ చేసేశారు. ఇళ్ల నుండి ఎవరూ బయటకు రాకూడదని ప్రభుత్వం హెచ్చరించింది.

ఇక ఎవరైనా అత్యవసరంగా కచ్చితంగా 48 గంటల ముందు తీసుకున్న కరోనా నెగిటివ్ రిపోర్ట్ ను తీసుకురావాల్సి ఉంటుంది. ఇక చైనా లోకి రష్యా , మయన్మార్ దేశాల నుండి రాకపోకల నేపథ్యం లో కరోనా కేసులు వస్తున్నాయని చైనా భావిస్తోంది. ఇక కరోనా మహమ్మారి మొదట చైనా లో పుట్టగా అక్కడి ప్రభుత్వం కట్టు దిట్టమైన చర్యలతో వైరస్ భారీ నుండి భయట పడింది. కానీ మళ్ళీ కేసులు రావడం తో ఆందోళన చెందుతోంది.