మనుషుల మధ్య నమ్మకాలు రోజు రోజుకీ తగ్గిపోతున్నాయి.అందుకే చిన్న చిన్న వాటికే గొడవలు పెరుగుతున్నాయి. మానవత్వం అనే మాట కనిపించకుండా పోతుంది. పెద్ద పెద్ద కంపెనీల అధిపతులు బ్యాంకులకు కోట్లకు కోట్లు ఎగ్గొడుతున్నారు. చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుండి మాత్రం రూపాయి దగ్గర ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా ఒడిషాలో జరిగిన సంఘటన ఇలాంటిదే. హోటల్ యజమాని కస్టమర్ పై విరుచుకు పడిన ఘటన సంచలనం రేపింది. 45రూపాయల భోజనం చేసిన ఒక కస్టమర్, తన దగ్గర 40రూపాయలే ఉండడంతో 5రూపాయలు మళ్ళీ ఇస్తానని అన్నాడు.
దానికి చెలరేగిపోయిన హోటల్ యజమాని, ఇంకా అతని తమ్ముడు కస్టమర్ పై విరుచుకు పడ్డారు. 5రూపాయలు రేపు ఇస్తా అన్నందుకు అతన్ని చావబాదారు. రోడ్డు మీదకి తీసుకువచ్చి చొక్కా చిరిగిపోయేలా చేతులతో విపుమీద గుద్దారు. హోటల్ యజమానితో పాటు అతని తమ్ముడు కూడా కస్టమర్ ని చావబాదారు. ప్రస్తుతం ఈ వీడీయో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. ఇదంటా చూస్తుంటే అరవింద సమేతలోని 5రూపాయలకే మర్డర్ సన్నివేశం గుర్తొస్తుందని చెప్పుకుంటున్నారు.