కరోనా అప్డేట్…లక్ష దాటిన ఒమిక్రాన్ కేసులు…!

-

ఆఫ్రికా దేశాల్లో మీదట వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ చేప కింద నీరులా దాదాపు అన్ని దేశాలకు పాకింది. ఈ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని మొదటి నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతూనే ఉంది. ఈ వేరియంట్ డెల్టా కంటే ఎక్కువ స్పీడ్ లో వ్యాపిస్తుంది శాస్త్ర వేత్తలు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అన్ని దేశాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు లక్ష దాటిపోయాయి. అంతే కాకుండా ఒమిక్రాన్‌తో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందారు.

తాజాగా నిన్న అమెరికాలో ఒమిక్రాన్ కారణంగా ఒకరు మృతిచెందారు. మరోవైపు యూకేలో నిన్న ఒకేరోజు 15,363 కేసులు నమోదు అయ్యాయి. అంతే ఒమిక్రొన్ ఏ రేంజ్ లో స్ప్రెడ్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. యూకేలో ఇప్పటి వరకు 60,508 నమోదు అయ్యాయి… డెన్మార్క్‌లో 26,362 కేసులు నమోదు అయ్యాయి. నార్వేలో మొత్తం 3,871 కేసులు నమోదు అయ్యాయి. కెనడాలో 2,294 మరియు యూఎస్‌లో 1,485 నమోదు అయ్యాయి. అదే విధంగా సౌతాఫ్రికాలో 1,444, జర్మనీలో 1,052 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news