నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటివ్

-

హిందూపూర్ శాసనసభ్యుడు, ప్రముఖ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల కరోనా లక్షణాలు కనిపించడంతో.. వైద్యులు నిర్ధారణ పరీక్షలు చేశారు. తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు రావడంతో.. పాజిటివ్ వచ్చిందని వైద్యులు వెల్లడించారు. దీంతో బాలకృష్ణను ఐసోలేషన్ అయినట్లు సమాచారం. అయితే బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి మెరుగుగా ఉందని వైద్యులు తెలిపారు.

హీరో బాలకృష్ణ

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు వైద్యులు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ రావడంతో.. ఐసోలేషన్‌కు వెళ్లాను. గడిచిన రెండు రోజులుగా నాతో కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోండి. ఎవరూ నెగ్లెట్ చేయకండి. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మెరుగుగా ఉంది. ఎవరూ ఆందోళన చెందకండి.’ అని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version