‘వెయ్ దరువెయ్’ అంటున్న హీరో సాయిరాం శంకర్..ఎందుకో తెలుసా?

-

టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్..ఇటీవల కాలంలో ప్రేక్షకుల ముందుకు రాలేదు. తాజాగా ఆయన నూతన చిత్రాన్ని ప్రారంభించారు. ఆ ఫిల్మ్ పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి.

సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఈ పిక్చర్ ను దేవరాజ్ పొత్తూరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీకి ‘వెయ్ దరువెయ్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాకు నవీన్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, సతీష్ ముత్యాల కెమెరామెన్ కాగా, భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.

ఈ మూవీ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ యంగ్ హీరోలు శర్వానంద్, విశ్వక్ సేన్, అల్లరి నరేశ్, ఆకాశ్ పూరీ హాజరయ్యారు. ఈ మూవీ సక్సెస్ పై మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. త్వరలో చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version