షాకింగ్; సిఎం ని కలిసిన ఎమ్మెల్యేకి కరోనా…

-

కరోనా వైరస్ ఏమో గాని ఇప్పుడు ఎవరిని ఎవరు కలవాలి అన్నా సరే భయపడే పరిస్థితి వచ్చింది. దేశ వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తున్న నేపధ్యంలో వెలుగులోకి వస్తున్న కొన్ని విషయాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఒక విషయం బయటకు వచ్చింది. ప్రధాని మోడి సొంత రాష్ట్రం గుజరాత్ లో ఒక సంఘటన జరిగింది. అసలు ఎం జరిగింది అనేది చూస్తే…

అహ్మదాబాద్‌లోని జమాల్‌పూర్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేదావాలా, గ్యాసుద్దీన్, శైలేష్ పర్మార్ అనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి సీఎం విజయ్ రుపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, హోంమంత్రి ప్రదీప్ సిన్హా జడేజాలను ఇటీవల కలిసారు. అహ్మదాబాద్ లో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను ముఖ్యమంత్రి… రూపాని వీరితో చర్చలు జరిపారు. ఈ సమావేశం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో జరిగింది.

ఆ సాయంత్రం 8 గంటలకు ఎమ్మెల్యే ఇమ్రాన్‌కు కరోనా పాజిటివ్ అని రావడంతో ఆయన అహ్మదాబాద్ లో ఒక ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ముఖ్యమంత్రిని కలిసిన సమయంలోనే ఎమ్మెల్యేకు కరోనా లక్షణాలు ఉండటం తో నమూనాలను కూడా ఇచ్చారు. అయినా సరే… ముఖ్యమంత్రితో సమావేశానికి అనుమతించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆయన అధికారులతో కూడా చర్చలు జరిపారు. ఇప్పుడు వాళ్ళను కూడా క్వారంటైన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version