హైద‌రాబాద్ లో పెరుగుతున్న క‌రోనా రీఇన్ఫెక్ష‌న్ కేసులు..!

-

హైద‌రాబాద్ లో రీఇన్ఫెక్ష‌న్ కేసులు ఎక్కువ‌గా న‌మోదు అవుతున్నాయ‌న వైద్యులు చెబుతున్నారు. క‌రోనా ఫ‌స్ట్ వేవ్ సెకండ్ వేవ్ ల‌లో క‌రోనా బారిన ప‌డిన వాళ్లల్లో కొంద‌రికి మ‌ళ్లీ క‌రోనా వ‌స్తుందని చెబుతున్నారు. కొత్త‌గా న‌మోద‌వుతున్న కేసుల్లో మూడింటిలో ఒక కేసు రీఇన్ఫెక్ష‌న్ కేసులే ఉన్నాయి. అయితే ఎక్కువ‌మందిలో ఎక్కువ ల‌క్ష‌ణాలు లేక‌పోవ‌డం ల‌క్షణాలు ఉన్నా కానీ స్వ‌ల్పంగా ఉండ‌టంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.

అంతే కాకుండా ఇప్ప‌టికీ న‌గ‌రంలో డెల్టా కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని వైద్యులు చెబుతున్నారు. దీనిపై కేర్ ఆస్ప‌త్రి సీఈవో రాజీవ్ సింఘాల్ ప‌లు విష‌యాలు తెలిపారు. త‌మ ఆస్ప‌త్రికి వ‌చ్చేవారిలో 20 నుండి 25శాతం వ‌ర‌కూ కేసులు రీఇన్ఫెక్ష‌న్ వే ఉంటున్నాయ‌ని అన్నారు. ఎక్కువ కేసుల్లో స్ప‌ల్ప ల‌క్ష‌ణాలే ఉంటున్నాయ‌ని ఇంటివ‌ద్దే చికిత్స తీసుకుంటున్నార‌ని తెలిపారు. గ‌తంలో క‌రోనా వ‌చ్చి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా రీఇన్ఫెక్ష‌న్ వ‌స్తుంద‌ని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news