ఏసీబీ అదుపులో పితాని పీఎస్: సమాచారం వచ్చిందా… లీకైందా?

-

ఏసీబీ నుండి కానీ పితాని సత్యనారాయణకు లీకులు వస్తున్నాయా? లేక ఏపీ ప్రభుత్వం నుంచి బాబుకే లీకులు అందుతున్నాయా? లేక నిజంగానే అధికారికంగా ఏసీబీ నుంచి పితాని ఫ్యామిలీకి ముందాస్తు సమాచారం అందిందా? ప్రస్తుతానికి ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు కానీ… మాజీ మంత్రి టీడీపీ నేత పితాని సత్యనారాయణ మాజీ పీఎస్ మురళీ మోహన్ ను శుక్రవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు!

అదేముందిలే అవినీతి కేసులో ప్రమేయం ఉందని తెలిసినా, అనుమానం వచ్చినా.. ఆ అనుమానానికి సరైన ఆధారం ఉన్నా కూడా సంబందిత అధికారులు పట్టుకుపోతారు కదా!! కరెక్టే… కానీ సరిగ్గా ఏసీబీ అధికారులు అరెస్టు చేయడానికి ఒకరోజు ముందే ఈ పీఎస్ ముందస్తు బెయిల్ కు ఎలా అప్లై చేసుకున్నారు?

ప్రస్తుతం ఏపీ వాసులను కదిలిస్తున్న ప్రశ్న ఇది! దీనికి కారణం అధికారిక సమాచారమా.. అనధికారిక లీకులా? అదే నిజమైతే ప్రభుత్వ పెద్దలు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయమిది! అలా కాకుండా అధికారికంగా సమాచారం అందిన తర్వాతే… వారు ముందస్తు బెయిల్ కు పిటిషన్ వేసుకుంటే… “వ్యవహారంలో పాత్ర” కన్ ఫాం అయినట్లే అనే విశ్లేషణలు ఆన్ లైన్ వేదికగా సాగుతున్నాయి!!

అవును… ఈఎస్ఐ స్కాంలో మరొకరిని ఏసీబీ ఈరోజు అదుపులోకి తీసుకుంది. సచివాలయంలో ఇవాళ విధుల్లో ఉన్న మురళీ మోహన్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా… ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు ముందుగా అరెస్ట్ అవ్వడం, ఆయనకు బెయిల్ రాకపోవడం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా పితాని మాజీ పీఎస్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేయడంతో… టీడీపీ శిబిరంలో ఆందోళనలు మళ్లీ మొదటికి వచ్చాయని అంటున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news