దేశ రాజధానిలోని ప్రజలకు నకిలీ కరోనా పరీక్ష నివేదికలను అందించినందుకు గానూ… 34 ఏళ్ల వైద్యుడు మరియు అతని సహచరుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం మీడియాకు వివరించారు. నిందితులను మాల్వియా నగర్ నివాసి కుష్ బిహారీ పరాషర్ మరియు అతని సహచరుడు అమిత్ సింగ్ గా గుర్తించారు. కరోనా పరీక్ష నివేదికల ఫోర్జరీకి సంబంధించి ఒక ప్రముఖ పరీక్షా ప్రయోగశాల నుండి తమకు ఫిర్యాదు అందిందని చెప్పారు.
దీని తరువాత హౌజ్ ఖాస్ పోలీస్ స్టేషన్లో సంబంధిత సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసామని అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 30 న, రోగులకు నర్సింగ్ సిబ్బందిని అందించే వ్యాపారాన్ని నడుపుతున్న డాక్టర్ పరాషర్ దీనికి సూత్రధారి. తన ఇద్దరు నర్సింగ్ సిబ్బందిని విధులకు పంపిన అతను కరోనా రిపోర్ట్ లు వారిని అడిగి తీసుకుని వాటిని ఒక వ్యాపారవేత్తకు పంపగా అందులో పేరు తేడాగా ఉంది. దీనితో అనుమానం వచ్చి పరిక్షా కేంద్రానికి వెళ్ళగా ఆ పేరులో ఎవరు లేరని గుర్తించారు.