ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 7,969 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాల్లో కేవలం 71 మందికి మాత్రమే కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. థర్డ్ వేవ్ వచ్చిన నాటి నుంచి ఒక రోజులో వంద లోపు కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలి సారి. అలాగే గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా ఒక్కరు మరణించారు.
కరోనా మరణాలు ఒక్క రోజులు ఇంత తక్కువగా నమోదు కావడం కూడా ఇదే తొలి సారి. కాగ ఈ రోజు రాష్ట్రంలో 595 మంది కరోనా మహమ్మారి నుంచి పూర్తి గా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 2,325 కరోనా యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. కాగ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ తో పాటు దేశ వ్యాప్తంగా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. కాగ ఈ ఏడాది థర్డ్ వేవ్.. కరోనా వైరస్ తో పాటు ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కారణంగా వచ్చింది. ఈ థర్డ్ వేవ్ లో మరణాలు తక్కువగా ఉన్నా.. లక్షల్లో కేసులు నమోదు అయ్యాయి.