ఇంగ్లాండ్ క్రికెట్ జ‌ట్టులో క‌రోనా క‌ల్లోలం

-

ఇంగ్లాండ్ క్రికెట్ జ‌ట్టును క‌రోనా వైర‌స్ వెంటాడుతుంది. ఇటీవ‌ల ఆస్ట్రేలియా తో ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్ లో పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఈ సిరీస్ నడుస్తున్న క్ర‌మంలోనే ఇంగ్లాండ్ క్రికెట్ జ‌ట్టులో క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇప్ప‌టికే ఇంగ్లాండ్ క్రికెట్ జ‌ట్టు స‌పోర్టింగ్ స్టాఫ్ తో పాటు ప్లేయ‌ర్స్ కుటుంబ సభ్యుల‌లో ఆరుగురికి క‌రోనా పాజిటివ్ అని తెలింది. తాజా గా ఆ జ‌ట్టు హెడ్ కోచ్ క్రిస్ సిల్వ‌ర్ వుడ్ కు కూడా క‌రోనా వైర‌స్ సోకింది.

అయితే ఇంగ్లాండ్ హెడ్ కోచ్ క్రిస్ సిల్వ‌ర్ వుడ్ ప్ర‌స్తుతం ఐసోలేష‌న్ లో ఉన్నాడ‌ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. యాషెస్ టెస్ట్ లోని నాలుగో టెస్టు కు కూడా హెడ్ కోచ్ క్రిస్ సిల్వ‌ర్ వుడ్ అందు బాటులో ఉండ‌డ‌ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. అయితే ఇంగ్లాండ్ ఆట‌గాళ్ల‌కు క‌రోనా వైర‌స్ సోక‌లేద‌ని తెలుస్తుంది. కాగ యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు తీవ్రంగా విఫ‌లం అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన మూడు టెస్టు మ్యాచ్ ల‌లో మూడింటీ లో కూడా ఇంగ్లాండ్ జ‌ట్టు భారీ తేడాతో ఓట‌మి పాలైయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version