ఏపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన స్కూళ్ళు !

ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు స్కూళ్ళు కాలేజీలు తలనొప్పిగా మారాయి. ఎందుకంటే విద్యా సంవత్సరం వృధా కాకూడదు అని భావించిన ప్రభుత్వం ఏపీలో స్కూల్లో కాలేజీలు తెరించింది. అయితే స్కూళ్ళలో వరుసగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడడం ఎప్పుడు ఏపీ సర్కార్ కి తలనొప్పిగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కరోనా కేసులు అడ్డంకి అని చెబుతున్న ప్రభుత్వం. స్కూళ్ళు ఓపెన్ చేసి విద్యార్థులకు కరోనా అంటేలా చేస్తుందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నట్టే వరుసగా రెండో రోజు కరోనా కేసులు బయటపడడం ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు తలనొప్పిగా మారింది.

ఏపీలో స్కూల్స్‌ తెరచుకున్న రెండోరోజే ఇద్దరు టీచర్లు, ముగ్గురు విద్యార్థులకు కరోనా వైరస్ సోకడం కలకలం రేపింది. నెల్లూరు జిల్లాలో ముగ్గురు విద్యార్థులు, ఓ టీచర్‌కు కరోనా సోకినట్లు తెలుస్తోంది. మరో వైపు కర్నూలు జిల్లాలోనూ ఓ టీచర్‌కు వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రెండో రోజున ఏపీలో 99.92 శాతం మేర స్కూళ్లు తెరుచుకున్నాయి. అయితే మొత్తంగా 33.69 శాతం మేర విద్యార్థుల హాజరయ్యారు. టీచర్లు 90.92 శాతం మేర విధులకు హాజరయ్యారు.