తిరుమల వేద పాఠశాలలో కరోనా కలకలం.. మొత్తానికి సెలవు ప్రకటించిన టీటీడీ !

-

కరోనా కేసులు మళ్ళీ క్రమేపీ పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు అయితే మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించే అవకాశాలు పరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలో తిరుమల వేద పాఠశాల లో కరోనా కలకలం రేగింది. మొత్తం ఆరుగురు విద్యార్థులు, నలుగురు అధ్యాపకులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో తిరుమల వేద పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థులకు టీటీడీ సెలవు ప్రకటించింది.

దీంతో మొత్తం 357 మంది విద్యార్థులు సొంత గ్రామాలకు వెళ్లి పోయారు. నిజానికి గతంలో కూడా ఇలా కరోనా పాజిటివ్ అని తేలగా వారిని మాత్రమే ఇళ్ళకు పంపారు. అయితే ఇప్పుడు వారి వలెనే మిగతా వారికి కరోనా సోకిందని భావిస్తుండటం వాళ్ళందరికీ ఇప్పుడు సెలవులు ప్రకటించారు. ఇక మళ్ళీ ఎప్పుడు దీనిని తెరుస్తారు అనేది చూడాల్సి ఉంది. ఇక టీటీడీ ఆధ్వర్యంలో ఈ వేద పాఠశాలలు నడుస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news