తెలంగాణ రాష్ట్రంలో కరోనా విశ్వ రూపాన్ని చుపిస్తుంది. రోజు రోజుకు కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. నిన్నటి వరకు మూడు వేల పైగా నమోదు అయిన కేసులు.. ఈ రోజు నాలుగు వేల మార్క్ ను అందుకున్నాయి. నిన్న తెలంగాణ రాష్ట్రంలో 3,557 కేసులు నమోదు అయ్యాయి. నేడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన కరోనా బులిటెన్ ఆధారంగా 4,207 కరోనా కేసులు వెలుగు చూశాయి.
అంటే నిన్నటితో పోలిస్తే.. 470 కరోనా కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. కాగ నేడు 1,20,215 కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపారు. కాగ దాదాపు ఏడు నెలల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. కాగ గడిచిన 24 గంటలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు కరోనా కాటుకు మృతి చెందారు. అయితే నేడు రాష్ట్రంలో 1,825 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 26,633 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.