హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు నాయకులు కూడా భయపడుతున్నారు. ఎప్పుడు ఎం జరుగుతుందో అనే ఆందోళన నాయకుల్లో ఇప్పుడు వ్యక్తమవుతుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే కరోనా దాని పని అది చేయడంతో నాయకులు కూడా చాలా వరకు అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నారు. తెలంగాణాలో అధికార తెరాస నాయకులను కరోనా బాగా భయపెడుతున్న సంగతి తెలిసిందే.
ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా కరోనా పరిక్షలు చేయించుకున్నారు. ఆయన శనివారం తనకు స్థానికంగా ఉన్న యునానీ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు జరుగుతున్న తీరును తెలుసుకోవడానికి వెళ్ళారు. అక్కడే కరోనా టెస్ట్ లు చేయించారు ఆయన. ఆంటీజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసారు వైద్యులు. ఈ టెస్ట్ లలో ఆయనకు నెగటివ్ వచ్చింది. ఇదే విషయాన్ని ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.
Free antigen testing is available in Urban Primary Health Centres and my appeal to all of you is to get yourself tested. – Barrister @asadowaisi https://t.co/lMOqWI2X4g
— AIMIM (@aimim_national) July 11, 2020