కరోనా వైరస్, ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో వచ్చిన థర్డ్ వేవ్.. ప్రపంచ వ్యాప్తంగా తగ్గుముఖం పట్టింది. చాలా దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గాయి. ఇప్పటికే చాలా దేశాలు కరోనా వ్యాప్తి కారణంగా విధించిన ఆంక్షలను సైతం ఎత్తివేశాయి. తగ్గింది అనుకున్న కరోనా వైరస్.. మరోసారి పంజా విసురుతుంది. కరోనా పుట్టిన దేశం అయిన.. చైనాలో కరోనా విజృంబిస్తుంది. ప్రతి రోజు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ కూడా విధిస్తున్నాయి. చైనా లోని అత్యంత రద్దీ గల నగరాల్లో చాంగ్ చున్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.
దీంతో అక్కడ ప్రభుత్వం కఠినమైన ఆంక్షలను అమలు ఉత్తర్వులను సైతం జారీ చేసింది. అంతే కాకుండా.. లాక్ డౌన్ ను కూడా విధించింది. ప్రజలు అందరూ ఇంట్లోనే ఉండాలని సూచిస్తుంది. నిత్యవసరాలు ప్రతి రెండు రోజులకు ఒక సారి ఒక్కరే వచ్చి తీసుకెళ్లాలని నిబంధనలు పెట్టింది. అలాగే ఈ నగరంలో వ్యాపార దుకాణాలను కూడా ప్రభుత్వం మూసివేసింది.
అంతే కాకుండా.. ప్రజలు తప్పకుండా కనీసం మూడు సార్లు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని సూచిస్తుంది. అలాగే ఈ నగరం నుంచి ప్రయాణాలను రద్దు చేసింది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి చర్యలు తీసుకుంటుంది. కాగ కరోనా వైరస్ తగ్గిందని అనుకుంటున్న సమయంలో మరోసారి లాక్ డౌన్, ఆంక్షలు అనే పేర్లు విన్న ప్రజలు మరోసారి భయంతో వణుకుతున్నారు.