భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. కాగా, గడిచిన 24 గంటల్లో 38,902 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,77,618కి చేరింది. అలాగే ఒక్క రోజులో దేశంలో 543 మంది చనిపోయారు. ఫలితంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 26,816కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుండి మొత్తం 6,77,423 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,73,379 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.