ప్రపంచ వ్యాప్తంగా కోరోనా మహమ్మారి తన తీవ్రతను పెంచుతుంది. లక్షల సంఖ్యలో ప్రాణాలు పోతున్నా సరే ఈ మహమ్మారి కనికరించట్లేదు. అలాగే భారత్ లో కూడా కరోనా వైరస్ విజృంభిస్తున్న తీరు.. దాని తీవ్రత చూస్తుంటే ఆందోళన కలుగుతుంది. లక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో కరోనా కేసులు మరింత పెరుగుతున్నాయి. కాగా, గడిచి 24 గంటల్లో దేశంలో నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య పది వేలు దాటింది. ఒక్క రోజే 10956 కేసులు రికార్డు అయ్యాయి. ఒకే రోజులో పదివేల మార్క్‌ను దాటడం దేశంలో ఇదే మొదటిసారి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా వైరస్ వల్ల 396 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 297535కు చేరుకున్నది. 141842 మందికి వైరస్ యాక్టివ్‌గా ఉన్నది. 147195 మందికి వైరస్ నుంచి కోలుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది. వైరస్ వల్ల దేశంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 8498కి చేరుకున్నది.