దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఏడాది పూర్తి

-

కరోనాపై పోరులో ఇండియా కీలక మైలు రాయిని చేరుకుంది. వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమై ఏడాది పూర్తియింది. పూర్తిగా ఉచితంగా ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇండియాలో అన్ని వర్గాల ప్రజలకు చేరువైంది. గతేడాది జనవరి 16న ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇవ్వడం మొదలైంది. మార్చి 1 నుంచి వ్యాధిగ్రస్తులు, వృద్దులకు టీకాలు ఇవ్వడం ప్రారంభించారు. ఎప్రిల్ 1 నుంచి దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారందరికి టీకాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈనెల 3 నుంచి 15-18 ఏళ్ల టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు.

అనేక అనుమానాలు, అపోహల మధ్య దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అయినప్పటికీ… అనతి కాలంలోనే రికార్డులకెక్కింది. దేశంలో ఇప్పటి వరకు 156 కోట్ల కరోనా డోసులను ఇచ్చారు. ఇందులో 90 కోట్లు మొదటి డోసులు కాగా…65 కోట్ల డోసులు రెండో డోసు. దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లు ఉచితంగా ప్రజలకు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version