9 స్పెషల్ ఫ్లైట్స్ తో దేశవ్యాప్తంగా వ్యాక్సీన్ సప్లై ప్రారంబించిన కేంద్రం..

-

దేశ వ్యాప్తంగా వ్యాక్సీన్ సప్లైని కేంద్రం ప్రారంభించింది. “సీరం” ద్వారా తయారు చేయబడిన “కోవిషీల్డ్ “ వ్యాక్సిన్ సరపరా ప్రారంభం అయింది. దేశ వ్యాప్తంగా 13 ప్రాంతాలకు తొమ్మిది ప్రత్యేక విమానాల ద్వారా  తరలిస్తున్నారు. 478 ప్రత్యేక బాక్సుల ద్వారా వ్యాక్సిన్ సరఫరా జరుగుతోంది. ఒక్కోక్క బాక్సు బరువు 32 కేజీలుగా ఉంది. ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ పంపిణీ చేపట్టింది.

తొలి విడత డోసులు ఎయిర్ ఇండియా, స్పైయిస్ జట్, ఇండిగో విమానాల ద్వారా   పుణె నుంచి ఢిల్లీ, అహ్మదాబాద్‌, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కర్నాల్‌, హైదరాబాద్‌, విజయవాడ, గువాహటి, లఖ్‌నవూ, చండీగఢ్‌, భువనేశ్వర్‌కు సరఫరా అయ్యాయి. ఇందుకోసం మొత్తం 8 ప్రత్యేక వాణిజ్య, 2 కార్గో విమానాలు వినియోగిస్తున్నారు. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు కరోనా వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version