కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఏపీ ప్రభుత్వం దాదాపుగా అన్ని రకాల చర్యలు తీసుకంటూనే ఉంది. ఈలోగా ఏపీలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతున్న తరుణంలో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో డ్రై రన్ చేపట్టాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలను ఎంపిక చేసుకుంటే అందులో ఏపీ కూడా ఉండడం విశేషం. ఈ క్రమంలో ఏపీలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది.
కేంద్రం నుంచి అందిన సూచనల మేరకు ఈ నెల 28వ తేదీన సోమవారం కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన డ్రై రన్ చేపట్టబోతోంది ఏపీ వైద్యారోగ్య శాఖ. ఈ మేరకు ఏపీలో కృష్ణా జిల్లాలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్విహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే కృష్ణా జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే క్షేత్ర స్థాయిలో ఆశా వర్కర్లను.. ఏఎన్ఎంలను.. వైద్యారోగ్య సిబ్బందిని సిద్దంగా ఉంచుతోంది ప్రభుత్వం.