కరోనా వ్యాక్సిన్.. గుడ్ న్యూస్ చెప్పిన హెటిరో..!

-

ప్రపంచంలోనే అతి పెద్ద మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కలిగిన భారత్ లో రష్యా తయారుచేసిన వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు ప్రస్తుత ఒప్పందం కుదుర్చుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం పలు ఫార్మా కంపెనీలు రష్యా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు ముందుకు వచ్చిన క్రమంలోనే ఇటీవల.. ఫార్మా కంపెనీలో దిగ్గజ సంస్థ గా దూసుకుపోతున్న హెటిరో కంపెనీ తయారుచేసిన వ్యాక్సిన్ స్పుత్నిక్ వి తయారీకి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక రకంగా శుభవార్త అని చెప్పాలి.

దాదాపు పది కోట్ల డోసులను తయారు చేసేందుకు హెటిరో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది అయితే ఈ డోసులు 2021 మొదటి నుంచి ఉత్పత్తి ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం హెటిరో ప్రతినిధులు తెలిపినట్లు తెలుస్తోంది. రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ ను సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తి చేస్తే.. స్థానికంగా సాధ్యమైనంత త్వరగా ప్రజలందరికీ పంపిణీ చేసేందుకు వీలు ఉంటుందని తద్వారా ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఇటీవలే ప్రతినిధులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news