గత కొంత కాలం నుంచి టీమిండియాలో కీలక ఆటగాడైన రోహిత్ శర్మ గాయంపై తీవ్రమైన చర్చ కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. బీసీసీఐ పై విమర్శలు రావడంతో రోహిత్ శర్మను టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేసిన బిసిసీఐ కానీ ప్రస్తుతం రోహిత్ శర్మ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేకపోవడంతో టెస్ట్ క్రికెట్ కూడా ఆడే అవకాశం తక్కువగా ఉన్నట్లు వాదన వినిపిస్తోంది. ఇప్పటివరకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం రోహిత్ శర్మ గాయంపై స్పందించలేదు.
తాజాగా ఇదే విషయంపై స్పందించిన టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ లో ముంబై తరఫున ఆడిన రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనలో తమతోపాటు ఫ్లైట్ ఎక్కు తాడని అనుకున్నామని కానీ అతను మాతోపాటు రాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే రోహిత్ శర్మ గాయం గురించి పూర్తిగా గందరగోళం నెలకొందని ఇప్పటివరకు తనకు కూడా క్లారిటీ లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ రోహిత్ శర్మ ఫిట్గా ఉంటే టెస్ట్ క్రికెట్ ఆడేందుకు రావచ్చు అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. బీసీసీఐ ఇప్పటికి కూడా తనకు రోహిత్ శర్మ గాయంపై స్పష్టత ఇవ్వలేదు అంటూ తెలిపాడు.