కేసీఆర్ కు పెద్ద తలనొప్పిగా మారిన హైదరాబాద్…!

-

గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా చుక్కలు చూపిస్తుంది. ఎన్ని చర్యలు చేపట్టినా సరే కేసులు కట్టడి కావడం లేదు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నేటి వరకు 32,000 కేసులు నమోదు అయ్యాయి. వారం లో 10,000 కేసులు నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీగా కేసుల నమోదు అవుతున్నాయి. హైద్రాబాద్ లో ప్రభుత్వ , ప్రయివేట్ హాస్పిటల్స్ లో బెడ్స్ ఫుల్ అవుతున్నాయి.

గ్రేటర్ లో ప్రతి రోజు వంద మంది హాస్పిటల్స్ లో అడ్మిట్ అవుతున్నారు. గ్రేటర్ హైద్రాబాద్ లో కరోనా కట్టడి కి ప్రత్యేక దృష్టి పెట్టిన తెలంగాణ సర్కార్… గ్రేటర్ హైదరాబాద్ లో 707 బృందాల తో జోరుగా ఫీవర్ సర్వే నిర్వహిస్తుంది. 5 రోజులు గా గ్రేటర్ హైదరాబాద్ లో రెండు లక్ష ఇళ్ల లో ఫీవర్ సర్వే చేసారు. గ్రేటర్ లో జోరుగా సోడియం హైపో క్లోరైట్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version