రాజమండ్రి సెంట్రల్ జైలు కరోనా అత్తగారిల్లు…!

-

తూర్పు గోదావరి జిల్లలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అక్కడ ఇప్పటి వరకు 27 వేల మంది కరోనా బారిన పడ్డారు. జిల్లాలో కరోనా కేసులు దాదాపుగా గ్రామాల్లోకి వెళ్ళాయి అని అక్కడి పరిస్థితులు చూస్తే స్పష్టంగా చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ఇప్పుడు అక్కడి జైళ్ళ శాఖ ను కూడా కరోనా వైరస్ తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 1,675 ఖైదీల్లో 265 మందికి కరోనా పాజిటీవ్ వచ్చింది.

తాజాగా 900 మంది ఖైదీలకు నిర్వహించిన కురోనా పరీక్షల్లో 247 మందికి పాజిటీవ్ నిర్ధారణ అయింది అని అక్కడి అధికారులు పేర్కొన్నారు. కొత్తగా పాజిటీవ్ నిర్ధారణ అయిన 247 మందికి సెంట్రల్ జైల్లోనే చికిత్స అందిస్తున్నారు వైద్యులు. రాజమండ్రి కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పది మంది ఖైదీల్లో ఒకరి ఆరోగ్యం విషమంగా ఉంది అని తెలుస్తుంది. ఐదు రోజుల క్రితం జి.ఎస్.ఎల్ కొవిడ్ ఆసుపత్రి నుంచి పరారైన పాజిటీవ్ వచ్చిన ఒక ఖైదీ కోసం వెతుకుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news