కరోనా మరణాలు లక్ష… ఇంకా పెరిగే అవకాశం…!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. కట్టడి అయినట్టే అయిన కరోనా ఒక్కసారిగా తన ప్రతాపం చూపిస్తుంది. 16 లక్షల మందికి పైగా కరోనా బాధితులు ఉండగా ఒక్క అమెరికాలోనే ఈ సంఖ్య భారీగా ఉంది. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య దాదాపుగా ఆరు లక్షలకు చేరువలో ఉండటం ఆందోళన కలిగించే అంశం. అక్కడ దాదాపుగా 18 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వమే చెప్తుంది. రాబోయే వారం రోజుల్లో కనీసం 30 వేల మంది అక్కడ చనిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇటలీ, స్పెయిన్, జర్మని, ఫ్రాన్స్ దేశాల్లో కరోనా కేసులు లక్ష దాటాయి. శుక్రవారం ఒక్కరోజే 93166 కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదు అయ్యాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధమవుతుంది. 49833 మంది ఆరోగ్యం విషమం గా ఉంది.

అమెరికాలో శుక్రవారం 33082 కేసులు నమోదు అయినట్టు తెలుస్తుంది. మొత్తం మృతుల సంఖ్య 18686కి చేరింది ఇటలీలో శుక్రవారం 3951 కేసులు నమోదు అయ్యాయి. అక్కడ మరణాలు దాదాపు 20 వేలుగా ఉన్నాయి. ఇక స్పెయిన్ లో మరణాల సంఖ్య వేగంగా పెరగడం తో కఠిన చర్యలు అమలు చేస్తున్నారు. ఆఫ్రికా దేశాలలో దీని ప్రభావం చాలా తక్కువగా ఉండగా యూరప్, అమెరికాలో మాత్రం చాలా దారుణంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news