తెలంగాణాలో 125 హాట్ స్పాట్లు…!

-

తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కరోనా నివారణా చర్యలను కేసీఆర్ సర్కార్ సమర్ధవంతంగా నిర్వహిస్తుంది. కరోనా వ్యాప్తి రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో ఎక్కడ ఎక్కువగా ఉందీ అనే దాని మీద దృష్టి సారించారు.

ప్రజలకు ఆ ప్రాంతంలో మరింత ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 125 వరకు హాట్‌స్పాట్లను గుర్తించారు. వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆయా ప్రాంతాల్లో 3,500 వైద్య బృందాలను మోహరించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మొత్తం 60 వేల నివాసాలను గుర్తించిన అధికారులు ఎవరిని కూడా బయటకు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

మొత్తం ఆయా ప్రాంతాల్లో మూడు లక్షల 50 వేల మందికి పరిక్షలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని గాంధీ, సరోజిని, కింగ్‌ కోఠీ, చెస్ట్‌, నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రుల్లో ఉన్న వారి ఐసోలేషన్‌ గడువు బుధవారం ముగిసింది. ఇక వారు అందరిని కూడా ఏప్రిల్‌ 28 వరకు హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. మొత్తం 167 కేంద్రాల నుంచి 3,158 మందిని ఇంటికి పంపిస్తున్నారు అధికారులు. వారిలో కేవలం 50 మందికి మాత్రమే కరోనా సోకింది.

Read more RELATED
Recommended to you

Latest news