కియాలో కరోనా…ఏపీలో కలకలం..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా చాపకింద నీరులా పాకుతుంది. రోజురోజుకీ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. తాజాగా అనంతపురం జిల్లా పెనుకొండలోని కియా మోటార్స్ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా సోకినట్టు తేలింది. ఆ ఉద్యోగి కియా మోటార్స్ లోని బాడీ షాప్ లో విధులు నిర్వర్తిస్తుంటాడని,  అతడు తమిళనాడుకు చెందినవాడని తెలుసుకున్నారు. ఈ నెల 25న ఇతను కర్మాగారానికి వచ్చాడు. వైద్య పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దాంతో అతడ్ని శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ ప్రాంగణంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అధికారులు అతడితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కియో మోటార్స్ కూడా ఇటీవలే తెరుచుకుంది. అనేక జాగ్రత్తలు తీసుకునే… ఉద్యోగులను లోపలికి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఉద్యోగి కరోనా బారినపడడం అటు సంస్థ యాజమాన్యాన్ని కలవరపెడుతుండగా, ఇటు ఉద్యోగుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version