ఈ వెధవలకు అస్సలు బుద్ధిరాదు.. వీళ్లు మారరంతే..!

-

అమెరికాలో ఫ్లాయిడ్‌ అనబడే 46 ఏళ్ల ఓ నల్ల జాతీయుడిపై తెల్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించడంతో అతను ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను అమెరికా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఆ దెబ్బకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దిగిరాక తప్పలేదు. ఈ క్రమంలోనే ఆ ఘటనకు బాధ్యులైన నలుగురు పోలీస్‌ ఆఫీసర్లను ఇప్పటికే ఉద్యోగం నుంచి తొలగించారు. వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. వారికి 40 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఆ ఘటన మరువక ముందే కొందరు ప్రబుద్ధులు సదరు బాధితుడు ఫ్లాయిడ్‌ పేరు మీదుగా ఫ్లాయిడ్‌ చాలెంజ్‌ను చేపడుతూ సోషల్‌ మీడియాలో తమ స్నేహితులకు చాలెంజ్‌లు విసురుతున్నారు.

అమెరికా పోలీసులు ఎలాగైతే ఫ్లాయిడ్‌ను నేలపై బోర్లా పడుకోబెట్టి మెడపై కాలితో నొక్కి పట్టారో.. అదే విధంగా యూకేలో ఫ్లాయిడ్‌ చాలెంజ్‌ పేరిట చాలా మంది అలాగే చేస్తూ ఫొటోలు దిగుతూ, వీడియోలు షూట్‌ చేస్తూ వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. అయితే ఈ కలకలంపై యూకే పోలీసులు స్పందించి ఆ చాలెంజ్‌లు చేసే వారిని వెంటనే అరెస్టు చేస్తున్నారు. వారిపై కేసులు పెడుతున్నారు. అయినప్పటికీ కొందరు ప్రబుద్ధులు మాత్రం మారడం లేదు. వర్ణ వివక్ష కారణంగా ఓ నల్ల జాతీయున్ని అమెరికా తెల్ల జాతీయులు చంపితే దానికి సానుభూతి తెలపాల్సింది పోయి.. ఇలా సిగ్గు లేకుండా చాలెంజ్‌లు చేయడం ఏమిటని.. కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారు ఇక అస్సలు మారరని, వారంతేనని అంటున్నారు.

అవును మరి.. అలాంటి ప్రబుద్ధులు మనదేశంలోనూ ఉన్నారు. మూగ జీవాలను హింసిస్తారు. అలాంటి వారు కొందరు తాజాగా ఓ ఏనుగును కూడా చంపారు. వీరు మారతారనుకోడం నిజంగా మన ఖర్మే అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version