తెలంగాణ అసెంబ్లీలో ఒకపక్క సమావేశాలు జరుగుతున్న సమయంలోనే కరోనా కలకలం రేగింది. అసెంబ్లీలో పాసులు ఇష్యూ చేసే ఉద్యోగికి కరోనా సోకినట్లు అధికారులు పేర్కొన్నారు .ఇప్పటికీ అతను వందల మంది ఉద్యోగులకు అదేవిధంగా పాసులు చేశాడు. కరోనా పరీక్షలు చేయించుకుని నెగిటివ్ రిపోర్టు ఉంటేనే లోపలికి అనుమతి అని అధికారులు చెప్పారు. అటు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
కానీ అనూహ్యంగా ఇప్పుడు సభలో పాసులు జారీ చేసే ఉద్యోగం రావడంతో ఎమ్మెల్యేలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనతో ఎమ్మెల్యేలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అసెంబ్లీ సమావేశాల సమయంలో ఇలా ఒక ఉద్యోగి కరోనా బారిన పడటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.