ప్రపంచాన్ని గజాగజా వణికిస్తున్న కరోనా వైరస్ ని ఎదుర్కోటానికి చాలా మంది భయపడుతున్నారు. ప్రభుత్వాలు మరియు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. మందులేని ఈ వైరస్ నీ ఎదుర్కోనాలంటే నియంత్రణ ఒకటే మార్గం కావటంతో దేశ ప్రధానులు అంతా లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని బలి తీసుకున్న ఈ వైరస్ నీ 85 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధుడు జయించాడు. కేరళ లో వృద్ధుడు కి కరోనా వైరస్ సోకటం తో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. రెండు వారాలపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ వరుసగా రెండు టెస్ట్ లలో నెగటివ్ రిపోర్టు తెచ్చుకునేలా చికిత్సకి బాగా సహకరించి అందరికీ షాకిచ్చాడు. ఇక రేపో, మాపో ఇంటికి పంపిస్తారనుకున్న సమయంలో అతడిని మృత్యువు మరొక విధంగా కాటేసింది.
ఇంతకీ ఆయన చనిపోయింది గుండెపోటుతో. వయసు మీద పడటంతో అనేక ఆరోగ్య సమస్యలు ఉండటంతో… నిద్రపోతూ వేకువజామున గుండెపోటుతో మరణించడం జరిగింది. దీంతో కరోనా నుంచి కోలుకున్నా చావు మాత్రం ఆగలేదు. ఈ వార్త కేరళలో సంచలనంగా మారింది.