కరోనా వైరస్ వల్ల మనిషి మనుగడ ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో పడింది. ఈ వైరస్ దెబ్బకి ప్రపంచంలో ఉన్న చాలా దేశాల ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఒక విధంగా చూసుకుంటే ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాలు అని చెప్పుకునే దేశాల పరిస్థితి రాబోయే రోజుల్లో ఈ కరోనా వైరస్ వల్ల ప్రపంచ పటంలో లేకుండా పోయిన ఆశ్చర్యపడక్కర్లేదని అంటున్నారు. అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ వైరస్ అరికట్టడానికి నానా తిప్పలు పడుతుంది. ఈ వైరస్ కి మందు లేకపోవటంతో నియంత్రణ చేద్దామని భావిస్తున్నా గాని ప్రజలు సహకరించాలి లేకపోతున్నారు. దీంతో ఉన్న కొద్ది వైరస్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా వైరస్ ప్రభావం చాలా గట్టిగా ఉంది.
రక్తనమూనాలో వైరస్ పాజిటివ్ వచ్చినప్పటికీ వ్యక్తి కళ్లె, మలంలో మాత్రం వైరస్ ఆనవాళ్లు కనిపించాయని చైనా డాక్టర్లు వెల్లడించారు. ఈ విషయాన్ని అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమైంది. దీంతో ఉన్న కొద్దీ ఈ మహామారి వైరస్ ని అరికట్టడానికి తొందరగా వ్యాక్సిన్ కనిపెట్టాలని ప్రపంచ వైద్య నిపుణులు శాస్త్రవేత్తలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఉన్న కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటకు రావడంతో వ్యాక్సిన్ కనిపెట్టే వాళ్ళకి ఇది ఒక పెద్ద సవాలుగా మారింది.