ఎలాంటి నొప్పినైనా త‌గ్గించే స‌హ‌జ‌సిద్ధ‌మైన పెయిన్ కిల్ల‌ర్స్ ఇవి..!

-

ప‌సుపులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. అందువ‌ల్ల ప‌సుపును కొద్దిగా పాల‌లో క‌లిపి తీసుకుంటే ఎలాంటి నొప్పి నుంచైనా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

కరోనా దెబ్బకు ఆఫీసులకి వెళ్ళకుండా ఇంట్లో నుండే పని చేస్తున్నవారు దాదాపుగా 99% ఉండి ఉంటారు. ఆఫీసులో ఉన్న సౌకర్యాలు మన ఇంట్లో ఉండే అవకాశాలు చాలా తక్కువ.. ఆఫీసులో కుర్చీలు కానీ, టేబుల్స్‌ కానీ పని చేసేందుకు వీలుగా ఉంటాయి. ఆపీసు పని ఇంట్లో చెయ్యాలంటే టీపాయి మనకు కంప్యూటర్‌ టేబుల్‌ అవుతుంది.. 8 గంటల పాటు పని చేస్తుంటే కలిగే ఇబ్బంది శారీరక ఇబ్బందులు కలుగుతాయి.. మరి మ‌న శ‌రీరంలో ఏ భాగంలో నొప్పి వ‌చ్చినా దాన్ని భ‌రించ‌డం క‌ష్ట‌మే. ముఖ్యంగా గాయాలు, దెబ్బ‌లు వంటివి తాకితే ఆ తాకిన చోట నొప్పి ఇంకా ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే ప‌లు ఇత‌ర సంద‌ర్భాల్లోనూ మ‌న‌కు కొన్ని సార్లు శ‌రీరంలో ఆయా భాగాల్లో నొప్పులు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే ఆ నొప్పుల‌ను త‌గ్గించుకునేందుకు చాలా మంది పెయిన్ కిల్ల‌ర్స్ వాడుతుంటారు. నిజానికి నొప్పుల కోసం వాడే పెయిన్ కిల్ల‌ర్స్ అంత మంచివి కావు. క‌నుక వాటికి బ‌దులుగా మ‌న ఇంట్లోనే ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన పెయిన్ కిల్ల‌ర్స్ లా ప‌నిచేసే ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవాలి. దాంతో నొప్పులు త‌గ్గుతాయి. మ‌రి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. అల్లం

అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగిస్తాయి. కొద్దిగా అల్లం ర‌సం తీసుకుంటే ఎలాంటి నొప్పి అయినా ఇట్టే త‌గ్గిపోతుంది.

2. గుమ్మ‌డికాయ విత్త‌నాలు

వీటిలో ఉండే మెగ్నిషియం నొప్పిని నివారించే ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. నొప్పులు ఉన్న‌వారు కొద్దిగా గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను తింటే ఫ‌లితం ఉంటుంది.

3. చేప‌లు

చేప‌ల్లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి నొప్పులను త‌గ్గిస్తాయి. వారంలో రెండు, మూడు సార్లు చేప‌ల‌ను తింటే ఎలాంటి నొప్పి అయినా ఇట్టే త‌గ్గిపోతుంది.

4. ప‌సుపు

ప‌సుపులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. అందువ‌ల్ల ప‌సుపును కొద్దిగా పాల‌లో క‌లిపి తీసుకుంటే ఎలాంటి నొప్పి నుంచైనా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

5. మిర‌ప‌కాయ‌లు

మిర‌ప‌కాయ‌లు కారంగా ఉంటాయి కానీ వాటి వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. వాటిల్లో ఉండే క్యాప్సెయిసిన్ అనే స‌మ్మేళ‌నం స‌హ‌జ‌సిద్ధ‌మైన పెయిన్ కిల్ల‌ర్‌గా ప‌నిచేస్తుంది. బాగా కారం తింటే మెద‌డు ఎండార్ఫిన్ల‌ను విడుద‌ల చేస్తుంది. అవి నొప్పిని తెలియ‌జేసే సిగ్న‌ల్స్‌ను మెద‌డుకు చేర‌కుండా అడ్డుకుంటాయి. దీని వ‌ల్ల నొప్పి తెలియ‌దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version