దేశంలో ఇప్పటి వరకు మనుషులకు మాత్రమే సోకుతున్న వైరస్ ఇప్పుడు సింహాలకు కూడా పాకిందని వార్తలు వచ్చాయి. హైదరాబాద్ నెహ్రూ జూ పార్కులో ఉన్న 8సింహాలకు ఈ వైరస్ సోకిందని తెలియడంతో ఒక్కసారిగా నగరం ఉలిక్కి పడింది. ఎందుకంటే సిటీలో చాలామంది కుక్కలను పెంచుకుంటారు. మరి జంతువులకు సోకే వైరస్ కుక్కలక కూడా సోకుతుందా అనే టెన్షన్ మొదలైంది.
ఈ క్రమంలోనే పశువైద్య శాలకు వేలల్లో ఫోన్లు వస్తున్నాయి. కుక్కలకు ఆ వైరస్ సోకుతుందా అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు.
ఇక్కడ సింహాలకు సోకింది కరోనా వైరస్ కాదని, డాక్టర్లు చెబుతున్నారు. ఆ వైరస్ మనుషులకు సోకదని, ఎలాంటి భయాలు వద్దని తెలిపారు. డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా వివరాలు వెల్లడించారు. ఇది కొవిడ్-19 కాదని, సార్స్-2 అనే వైరస్ సింహాలకు సోకిందని వివరించారు. ఇక కుక్కల్లోనూ 20 ఏళ్లుగా కరోనా వైరస్ ఉందని ఆయన వెల్లడించారు.