భారత్‌లోకి ప్రవేశించిన ‘కరోనా’ వైరస్‌.. ఎక్క‌డంటే..?

-

కరోనా వైరస్.. ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న వైరస్ ఇది. పాముల నుంచి ఈ వైరస్ సోకినట్లుగా అనుమానిస్తున్న వైద్య నిపుణులు.. దీన్ని తొలిసారిగా చైనాలో గుర్తించారు. దీని వ‌ల్ల వల్ల చైనాలో వందల మంది అనారోగ్యానికి గురయ్యారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. శ్వాస ఇబ్బందులు తీవ్రం అయ్యేలా చేసే ఈ వైరస్‌ను మొదట వుహాన్ నగరంలో గుర్తించారు. వేగంగా వ్యాపించే ఈ ఇన్ఫెక్షన్‌కు న్యుమోనియా లాంటి లక్షణాలు ఉంటాయి. అయితే తాజాగా చైనాలో వ్యాపించి, ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ భారత్‌లోకి ప్రవేశించింది.

కేరళకు చెందిన ఓ విద్యార్థికి కరోనా వైరస్‌ సోకినట్టుగా వైద్యులు గుర్తించారు. అనారోగ్యంతో ఉండడంతో ఆసుపత్రిలో చేర్పించగా, పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా వైరస్ సోకిందని నిర్ధారించారు. ప్రస్తుతం ఆ విద్యార్థి పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా, ఆ విద్యార్థి చైనాలోని వుహాన్‌ యూనివర్సిటీలో మెడిసిన్‌ చదువుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version