హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకోనున్న బాలయ్య…..??

-

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల నటించిన రూలర్ సినిమాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మాతగా తెరకెక్కిన ఆ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలు అన్ని కూడా నిరాశలు అయ్యాయి. ఇక అక్కడి నుండి కొంత ఆలోచన చేసిన అనంతరం తన తదుపరి సినిమా అవకాశాన్ని తన ఫేవరెట్ దర్శకుడు బోయపాటి శ్రీనుకు అందించిన బాలయ్య, అతి త్వరలో ఆ సినిమా షూట్ లో పాల్గొననున్నారు. ద్వారకా మూవీస్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించనున్న ఆ సినిమాకు యువ సంగీత దర్శకుడు థమన్ సంగీతాన్ని అందిస్తుండగా ప్రస్తుతం ఇందులో నటించబోయే ఇద్దరు హీరోయిన్ల ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఇటీవల గుండు చేయించుకుని అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చిన బాలయ్య, అతి త్వరలో హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకోబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. నిజానికి తన ఎంటైర్ సినీ కెరీర్లో ఇప్పటివరకు పలు రకాల విగ్గులతో సినిమాల్లో దర్శనమిచ్చిన బాలయ్య, ఇకపై విగ్గులతో కాకుండా సొంత జుట్టుతోనే కనపడనున్నారని అంటున్నారు. అయితే అందుకోసమే ఆయన సడన్ గా గుండు  చేయిచుకున్నారని, ఇటీవల అమెరికా లోని కొందరు ప్రఖ్యాత హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ నిపుణులతో మాట్లాడిన అనంతరం తన హెయిర్ కు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశ్యంతోనే బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.

 

కాగా ఫిబ్రవరి మొదటి వారంలో బాలయ్యకు అమెరికా లో ట్రాన్స్ ప్లాంటేషన్ జరుగనుందని, ఆ తరువాత మూడు వరాల పాటు రెస్ట్ తీసుకున్న అనంతరం అదే నెలాఖరులో బోయపాటి సినిమా షూటింగ్లో ఆయన పాల్గొంటారని అంటున్నారు. నిజానికి బోయపాటి సినిమా ఫిబ్రవరి మొదటి వారంలోనే ప్రారంభం కావలసి ఉన్నప్పటికీ, కథ విషయంలో దర్శకుడు బోయపాటి పూర్తిగా సంతృప్తి చెందనందున మరొక మూడు వారలు వాయిదా పడ్డట్లు చెప్తున్నారు. సో, దీనిని బట్టి తన హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనంతరం హ్యాపీగా బాలయ్య న్యూ హెయిర్ స్టైల్ తో షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది…..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version