కరోనా పాజిటివ్‌గా తేలిన ఓ గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ ఘటన ఢిల్లీని ఎయిమ్స్ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలిన ఎయిమ్స్ వైద్యుని భార్యే ఈరోజు బిడ్డకు జన్మనిచ్చిన గర్భిణి.
వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న సీనియర్ వైద్యుడికి కరోనా సోకింది. అది ఆ వైద్యుని నుంచి తొమ్మిది నెలల గర్భవతి అయిన అతని భార్యకూ కూడా వ్యాపించింది. దీంతో వారిద్దరిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఐసోలేషన్ వార్డుల్లో ఉన్న సదురు గర్భిణి శుక్రవారం రాత్రి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
అయితే ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని.. ఇప్పటికైతే ఎలాంటి కరోనా లక్షణా లేవని వైద్యులు తెలిపారు. దేశంలో కరోనా పాజిటివ్‌గా తేలిన ఓ గర్భిణి బిడ్డకు జన్మనివ్వడం ఇదే తొలిసారని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు కరోనా పాటివ్‌గా తేలిన గర్భిణిలకు వైద్యం అందించడానికి ఇప్పటికే ఎయిమ్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.