అవున్లే.. ఎంతైనా మనోడు మనోడే.. పరాయోడు.. పరాయోడే.. కరోనాపై పోరాటానికి ఇప్పటికే మన స్వదేశీ కంపెనీలు భారీ ఎత్తున విరాళాలను ప్రకటించాయి. ఇప్పటికీ అనేక కంపెనీలు తమకు తోచినంత విరాళాలను అందజేస్తున్నాయి. అయితే విదేశీ కంపెనీలు మాత్రం.. ఆ.. మాకెందుకులే.. అని తమకు ఏమీ పట్టనట్టు ఉన్నాయి. కరోనా అంటే.. అసలు ఆ ఏమిటి..? అన్నట్లు తమకు అసలు సంబంధమే లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నాయి. దీంతో జనాలు ఆయా కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మన దేశానికి చెందిన టాటా గ్రూప్ రూ.1500 కోట్లు, విప్రో రూ.1100 కోట్లు, రిలయన్స్ రూ.500 కోట్లు, ఎన్ఎండీసీ రూ.150 కోట్లు, ఇన్ఫోసిస్ రూ.100 కోట్లు, హీరో గ్రూప్ రూ.100 కోట్లు, టోరెంట్ గ్రూప్ రూ.100 కోట్లు, ఏషియన్ పెయింట్స్ రూ.35 కోట్లు, టీవీఎస్ మోటార్స్ రూ.25 కోట్లు, పతంజి గ్రూప్ రూ.25 కోట్లు, ఎల్ అండ్ టీ రూ.150 కోట్లు.. ఇలా అనేక కంపెనీలు తమ వంతు విరాళాలను ప్రకటించాయి. అయితే మనం నిత్యం జీవితంలో భాగమైన పలు విదేశీ కంపెనీలు మాత్రం ఇప్పటి వరకు కరోనాపై పోరాటానికి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. దీంతో ఇప్పటి వరకు ఇలాంటి కంపెనీలనా.. మనం డబ్బులు ఇచ్చి బతికించి, ఈ స్థాయికి తెచ్చింది..? అని జనాలు కోపోద్రిక్తులవుతున్నారు.
సబ్‌వే.. పిజ్జా హట్.. మెక్ డొనాల్డ్.. బర్గర్ కింగ్.. కేఎఫ్‌సీ.. ఫ్లిప్‌కార్ట్.. అమెజాన్.. మింత్రా.. స్నాప్‌డీల్.. ఫేస్‌బుక్.. అలీబాబా.. వివో.. ఒప్పో.. ఇలా పలు కంపెనీలు కరోనాపై పోరాటానికి ఇంకా విరాళాలను అందించలేదు. అలాగే ఈ లిస్ట్‌లో ఇంకా చాలా సంస్థలే ఉన్నాయి. అవన్నీ తమకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో జనాలకు అసలు విషయం ఏమిటనేది బోధపడింది. ఇప్పటి వరకు విదేశీ కంపెనీలను ఆదరించినందుకు తగిన శాస్తి జరిగింది.. అని చాలా మంది అనుకుంటున్నారు. స్వదేశీ కంపెనీలు కష్టకాలంలో మనల్ని ఆదుకుంటున్నాయి. కానీ విదేశీ కంపెనీలు మాత్రం మనల్ని పట్టించుకోవడం మానేశాయి. జనాల వల్ల మనకు ఏం ఒరిగింది.. అనుకున్నారో, ఏమో గానీ.. ఆయా విదేశీ సంస్థల వ్యవహార శైలిని మాత్రం జనాలు తప్పుబడుతున్నారు. మరి కరోనా తగ్గాక ఆయా కంపెనీలపై జనాలు ఏవిధంగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తారో చూడాలి..!