భారీగా క‌రోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల స్వాధీనం..

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరులో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌రుగుతుండ‌డంపై డీఎంహెచ్‌వో సునంద ఫిర్యాదు చేయ‌డంతో రైట్ ల్యాబ్‌పై టూటౌన్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ల్యాబ్ నుంచి పెద్ద సంఖ్య‌లో ర్యాపిడ్ టెస్ట్ కిట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. రైట్ ల్యాబ్ నిర్వాహ‌కుడు దోణెపూడి సురేశ్‌తోపాటు మ‌రొక‌రిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇదిలా ఉండ‌గా.. ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసులు అమాంతంగా పెరుగుతున్నాయి. ప్ర‌తీ రోజు వేల‌సంఖ్య‌లో కేసులు న‌మోదు అవుతున్నాయి.

coronavirus

ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇదే స‌మ‌యంలో క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి రాష్ట్ర ప్ర‌భుత్వం అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటోంది. ప్ర‌జ‌లు కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని కోరుతోంది. ఎవ‌రికివారు స్వీయ‌నియంత్ర‌ణ పాటించాల‌ని సూచిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version