రూ.3లక్షలు కడితేనే మృతదేహం ఇస్తాం..ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం!

కొండాపూర్‌లో కిమ్స్‌ ఆస్పత్రిలో దారుణం జరిగింది..విజయేందర్ రెడ్డి అనే వ్యక్తి గత నాలుగు రోజులుగా కరోనాతో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందాడు..ఇప్పటికే కరోనా చికిత్సకు విజయేందర్ రెడ్డి కుటుంబసభ్యులు రెండున్నర లక్షల రూపాయలు హాస్పిటల్ కు చెల్లించారు..

మరో రూ.3లక్షలు చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇస్తామంటూ ఆస్పత్రి వర్గాలు బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు..దీంతో కిమ్స్‌ ఆస్పత్రి ముందు బంధువులు ఆందోళన దిగారు..డబ్బు కట్టలేదని విజయేందర్ రెడ్డి మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి ఆస్పత్రి వర్గాలు నిరాకరిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు..కరోనా పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టానుసారంగా దండుకుంటున్నాయి. ఆఖరికి పేషెంట్‌ చనిపోతే డబ్బులు కడితేనే మృతదేహాన్ని ఇస్తామంటూ కనికరం లేకుండా వ్యవహరిస్తున్నాయి.